ఫుల్ బాలీవుడ్ వైబ్స్.. లైగర్ నుండి కోకా సాంగ్

Vijay Deverakonda's Liger Song Coka 2.0 Release. విజయ్ దేవరకొండ, అనన్య పాండే నటిస్తున్న చిత్రం లైగర్.

By Medi Samrat  Published on  12 Aug 2022 8:30 PM IST
ఫుల్ బాలీవుడ్ వైబ్స్.. లైగర్ నుండి కోకా సాంగ్

విజయ్ దేవరకొండ, అనన్య పాండే నటిస్తున్న చిత్రం లైగర్. భారీ స్థాయిలో ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. పూరి జగ్గన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 'పాన్-ఇండియా' రేంజిలో విడుదలఅవుతోంది. మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్‌తో పాటు రమ్య కృష్ణన్, మకరంద్ దేశ్‌పాండే తదితరులు నటించారు.


ఇక రిలీజ్ కు దగ్గర పడుతూ ఉండడంతో సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ ను పెంచారు. 'కొనిస్తనే కోకా కోకా కోకా' అంటూ ఈ పాట సాగుతోంది. విజయ్ దేవరకొండ - అనన్య పాండే మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా డ్యాన్స్ చేశారు. అనన్య పాండే గ్లామర్ కూడా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో పూరీ జగన్నాథ్ కూడా సందడి చేశారు. అయితే ఎక్కువగా పాటలో బాలీవుడ్ టచ్ ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి.


Next Story