ఆ వార్త‌ల‌ను 'నాన్సెన్స్' అంటూ కొట్టిపడేసిన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Finally Reacts to Wedding Rumours With Pushpa Star Rashmika Madanna. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మధ్య ప్రేమ వ్యవహారం ఉందనే వార్తలు ఎప్పటి నుంచో

By Medi Samrat  Published on  22 Feb 2022 9:48 AM GMT
ఆ వార్త‌ల‌ను నాన్సెన్స్ అంటూ కొట్టిపడేసిన విజయ్ దేవరకొండ

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మధ్య ప్రేమ వ్యవహారం ఉందనే వార్తలు ఎప్పటి నుంచో చక్కర్లు కొడుతున్నాయి. వారు మంచి స్నేహితులమని చెబుతూ ఉన్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియా కథనాలను ప్రచురిస్తోంది. ఈ పెళ్లి వార్తలపై విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా అఫీషియల్ గా స్పందించాడు. 'నాన్సెన్స్' అంటూ కొట్టిపడేశాడు. ఇలాంటి వార్తలు తమకు అవసరం లేదని చెప్పాడు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలలో నటించారు. భారతదేశం అంతటా అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఇద్దరూ ఈ ఏడాది హిందీ సినిమా ఇండస్ట్రీలో కూడా సందడి చేయనున్నారు.

వారిద్దరూ ఎప్పుడూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే వార్తలను ఖండించలేదు, ధృవీకరించలేదు. ఇటీవల ఏకంగా పెళ్ళికి సంబంధించిన రూమర్స్ గురించి ఓ మీడియా సంస్థ న్యూస్ రాయడంపై విజయ్ దేవరకొండ గట్టి సమాధానం ఇచ్చాడు. ఆ ట్వీట్ మీరే చూసి.. అందులో మీనింగ్ ఏమిటో మీరే తెలుసుకోండి. విజయ్ తన బాలీవుడ్ డెబ్యూ 'లైగర్' షూటింగ్ ముంబైలో జరుగుతోంది. రష్మిక ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి మారినట్లు సమాచారం. సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన మిషన్ మజ్నుతో రష్మిక బాలీవుడ్ అరంగేట్రం కోసం సిద్ధమవుతోంది.


Next Story
Share it