సుకుమార్‌ సినిమాలో విజయ్‌ దేవరకొండ అలా కనిపించనున్నాడట..!

Vijay Devarakonda Acts In Sukumar Direction. టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ సినిమాలో

By Medi Samrat  Published on  6 March 2021 10:47 AM IST
Vijay Devarakonda Acts In Sukumar Direction

టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పెళ్లి చూపులు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ సాధించాడు. ఆ తర్వాత అర్జున్‌రెడ్డి మూవీతో సంచలనం సృష్టించాడు. ఇక విజయ్‌ నటన, బాడీలాంగ్వేజ్‌కు యువతలో మంచి క్రేజ్‌ ఉంది. ఇక వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు విజయ్‌ దేవరకొండ. ప్ర‌స్తుతం లైగర్‌ అనే ఇంటస్ట్రీంగ్‌ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న మూవీలో సంద‌డి చేయ‌నున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ జరుపుకొంటోన్న‌ ఈ సినిమా పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతుంది. ఈ సినిమాతో విజయ్‌ దేవరకొండ బాలీవుడ్‌కి అనన్య టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.

ఇదిలా ఉండగా.. విజయ్‌ దేవరకొండ టాప్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను చాలా రోజుల కిందటనే ప్రకటన చేశారు. ప్రస్తుతం సుకుమార్‌ అల్లు అర్జున్‌తో పుష్ప అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ శర వేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత విజయ్‌ దేవర కొండతో సినిమా ఉండనుంది. పుష్ప సినిమా కంటే ముందే విజయ్‌కు స్టోరీ లైన్‌ వినిపించాడట సుకుమార్‌.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజ్‌ అప్‌డేట్‌ సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. విజయ్‌ దేవరకొండతో యుద్ధ నేపథ్యంలో సాగే క‌థ‌ను తెరకెక్కంచబోతున్నాడట సుకుమార్‌. విజయ్‌ దేవరకొండ సైనికుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో అందమైన ప్రేమ కథ కూడా ఉంటుందని టాక్‌ వినిపిస్తోంది. ఇదే విషయమై గతంలోనూ వార్తలు వచ్చాయి. తాజాగా మరోమారు సినీ స‌ర్కిల్స్‌లో ఈ వార్త వైరల్‌ అవుతోంది.




Next Story