తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ స్పందించారు. తన జీవితంలో ఇంత విషాదకరమైన పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కొనలేదని, ఈ ఘటన నన్ను కలిచి వేసిందని బాధను వ్యక్తం చేశారు. ఎంతో ప్రేమతో నా మీటింగ్ కు ప్రజలు వచ్చారని త్వరలో బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పారు. నన్ను టార్గెట్ చేయండి.. కానీ నా ప్రజలను చేయొద్దు. నేనూ మనిషినే, అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఊహించని ఘటన జరిగింది. తాను ఎప్పుడూ ఎవరికీ అపకారం తలపెట్టలేదన్నారు విజయ్.
ఇప్పటికే 5 జిల్లాల్లో ప్రచారం చేసానని, కానీ ఇది కరూర్‌లో మాత్రమే ఎందుకు జరిగింది? మిగతాచోట్లా ఎందుకు జరగలేదని విజయ్ వీడియోలో ప్రశ్నించారు. సీఎం స్టాలిన కావాలనుకుంటే నామీద ప్రతీకారం తీర్చుకోవచ్చని, అంతే కానీ నాపై కోపం మా నాయకులపై చూపించవద్దన్నారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని వీడియో సందేశాన్ని ఎక్స్ ఖాతాలో విజయ్ విడుదల చేశారు.