గేమ్ ఛేంజర్ సినిమా భారీ ఈవెంట్‌కు చెన్నై సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరణ్ అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా చెన్నై ఈవెంట్ కు సంబంధించిన అతిథి జాబితా చాలా భారీగా ఉంది. దిల్ రాజు ఇద్దరు తమిళ సినిమా సూపర్ స్టార్‌లు తలపతి విజయ్, సూపర్ స్టార్ రజనీకాంత్‌లను ఆహ్వానించినట్లు తమిళ మీడియా చెబుతోంది.
గేమ్ ఛేంజర్ ఈవెంట్‌ను గుర్తుండిపోయేలా నిర్వహించడానికి దిల్ రాజు విజయ్, రజనీకాంత్‌లను ఆహ్వానించినట్లు చెబుతున్నారు. వారు వస్తే మాత్రం సినిమాకు తమిళనాడులో మంచి రీచ్ ఉంటుంది. తెలుగు సినిమా భారీ ఈవెంట్ లో తమిళ స్టార్స్ వస్తే క్రాస్-ఇండస్ట్రీ సహకారాన్ని చూడొచ్చు. తమిళం, తెలుగు సినిమాల అభిమానులకు ఈ ఈవెంట్ ఓ గిఫ్ట్ గా మారుతుంది.