ఆ వీడియోలు నావి కావు

‘భూల్ భూలయ్యా 3’లో కనిపించిన నటి విద్యాబాలన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రమాదకరమైన వినియోగానికి బలయ్యారు.

By Medi Samrat  Published on  2 March 2025 4:30 PM IST
ఆ వీడియోలు నావి కావు

‘భూల్ భూలయ్యా 3’లో కనిపించిన నటి విద్యాబాలన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రమాదకరమైన వినియోగానికి బలయ్యారు. ఆన్ లైన్ లో వైరల్ అవుతున్న వీడియోలు తనవి కావని విద్యా బాలన్ తెలిపారు.తనకు సంబంధించిన వీడియోలు కొన్ని వైరల్ అవుతున్నాయని, ఏ మాత్రం ప్రామాణికత లేని ఆ వీడియోలను నమ్మి మోసపోవద్దని సోషల్ మీడియాలో తన ఫాలోవర్లకు సూచించారు.

డీప్ ఫేక్‌లను ఉపయోగించి వీడియో కంటెంట్‌ను రూపొందించడం చాలా సులువుగా ఉన్న ప్రస్తుత కాలంలో తాను ప్రమోట్ చేస్తున్నట్లుగా కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయని, అలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె తన ఫాలోవర్లను కోరారు. తప్పుదారి పట్టించే సమాచారాన్ని గుర్తించాలని కూడా కోరారు. ప్రస్తుతం సోషల్ మీడియా, వాట్సాప్‌లో అనేక వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి, అయితే ఆ వీడియోలు AI ద్వారా రూపొందించినవని స్పష్టం చేయాలనుకుంటున్నానన్నారు విద్యా బాలన్. ఇలాంటి కంటెంట్‌ను తాను ఏ విధంగానూ ఆమోదించనని తెలిపారు విద్యా బాలన్.

Next Story