చిరంజీవి సినిమాలో విద్యా బాలన్.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఇదే.!
Vidya Balan Acts In Chiranjeevi Movie. లూసిఫర్ తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on
7 Jun 2021 11:16 AM GMT

లూసిఫర్ తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకుడు. అయితే ఈ సినిమాలో సిస్టర్ రోల్ గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకూ చిరుకు సిస్టర్ రోల్‌లో నయనతార నటిస్తోందని వార్తలు వచ్చాయి. ఏమైందో ఏమో గానీ ఆ వార్తలు అబద్దమని.. చిరంజీవి సోదరిగా విద్యా బాలన్ నటిస్తోందనే వార్త హాట్ టాఫిక్‌గా మారింది. ఇప్పటికే దర్శకుడు మోహన్ రాజా.. విద్యా బాలన్ ను కలిసి కథ చెప్పినట్లు.. దానికి విద్యా ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలావుంటే.. ఈ రీమేక్‌లో చిరు సోదరిగా త్రిష, రాధిక, ఖుష్బు, విజయశాంతి, జెనీలియా చేస్తున్నారంటూ ఇదివరకే పేర్లు వినిపించాయి. కానీ అవన్ని రూమర్లుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం విద్యా బాలన్ నటిస్తోందన్న వార్త హల్‌చల్ చేస్తోంది. ఇక విద్యా బాలన్ విషయానికొస్తే.. బాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి అగ్రనాయికగా గుర్తింపుపొందింది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ సత్తా చాటుతుంది.
Next Story