'శ్రీకారం' సినిమాకు ఉపరాష్ట్రపతి ప్రశంసలు

Vice President Venkaiah Naidu Praises Sreekaram Movie. శర్వానంద్ హీరోగా నూత‌న ద‌ర్శ‌కుడు కిషోర్ తెర‌కెక్కించిన‌ ‘శ్రీకారం’

By Medi Samrat  Published on  22 March 2021 3:09 PM GMT
శ్రీకారం సినిమాకు ఉపరాష్ట్రపతి ప్రశంసలు

శర్వానంద్ హీరోగా నూత‌న ద‌ర్శ‌కుడు కిషోర్ తెర‌కెక్కించిన‌ 'శ్రీకారం' చిత్రానికి ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆధునిక వ్యవసాయం ప‌ద్ధ‌తులు, యువత వ్యవసాయంలోకి రావాలి అనే ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో శర్వానంద్‌ సరసన ప్రియాంక మోహన్ నటించింది.


ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోగా.. తాజాగా ఈ చిత్రంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఈ మేర‌కు ట్విట‌ర్ వేదిక‌గా రెండు ట్వీట్‌లు చేశారు. 'వ్యవసాయ పునర్వైభవం కోసం గ్రామాలకు మరలండి అనే స్ఫూర్తిని యువతలో రేకెత్తించే విధంగా తెరకెక్కించిన 'శ్రీకారం' చక్కని చిత్రమని వెంకయ్యనాయుడు తెలిపారు. కుటుంబం, ఊరు అందరూ కలిసి ఉంటే సాధించలేనిది ఏదీ లేదనే చక్కని సందేశాన్ని అందించిన చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులకు శుభాకాంక్షలు అంటూ ఉపరాష్ట్రపతి ట్వీట్ చేశారు.


అలాగే.. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామాలకు అందించి, వ్యవసాయంతో జోడించి, పరస్పర సహకారంతో ఆత్మవిశ్వాసంతో అన్నదాత ముందుకు వెళ్ళవచ్చు అన్న సందేశాన్ని శ్రీకారం అందిస్తోంది. యువత చూడదగిన చక్కని చిత్రం' అంటూ శ్రీకారం సినిమాపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసలు కురిపించారు.


Next Story