రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమ, పెళ్లిపై ఆ జ్యోతిష్యుడి సంచలన వ్యాఖ్యలు

Venu Swamy Comments On Rakul Preeth Singh Marriage. ఇటీవలే సమంత-నాగచైతన్య విడిపోయారు. ఆ సమయంలో కొన్ని సంవత్సరాల ముందు

By Medi Samrat  Published on  23 Oct 2021 6:53 PM IST
రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమ, పెళ్లిపై ఆ జ్యోతిష్యుడి సంచలన వ్యాఖ్యలు

ఇటీవలే సమంత-నాగచైతన్య విడిపోయారు. ఆ సమయంలో కొన్ని సంవత్సరాల ముందు జ్యోతిష్యులు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇప్పుడు మరో టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ కు చెందిన జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న రకుల్‌ ఈ విషయాన్ని ఇటీవలే ప్రకటించారు. తన 31 వ పుట్టినరోజు సందర్భంగా జాకీ భగ్నానీతో తన రిలేషన్‌ షిప్ ను బయటపెట్టింది. అయితే వీరిద్దరి రిలేషన్ షిప్ ఎక్కువ రోజులు నిలబడదని వేణు స్వామి చెబుతున్నారు.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పెళ్లి ఎంగేజ్‌మెంట్‌ వరకు వచ్చి ఆగిపోతుందని, ఒకవేళ వివాహం జరిగినా విడిపోతారని వేణు స్వామి అంటున్నారు. రకుల్‌- జాకీ భగ్నానీల జాతకాన్ని పరిశీలించిన వేణుస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. జాకీ భగ్నానీది మకర రాశి అని, ఆయన జాతకంలో శని దృష్టి చంద్రుడు, శుక్రుడిపై ఉన్నందున వివాహానికి సంబంధించిన సమస్యలు వస్తాయని అన్నారు. ఇక రకుల్‌ది మిధున రాశి అని, ఆమె జాతకంలో గురువు, కేతువు కలిసి ఉండటం వల్ల కుటుంబం సౌఖ్యం ఉండదని వివరించారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌- జాకీ భగ్నానీల పెళ్లి జరిగినా ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని.. సంతానం కలగకపోవడం సహా న్యాయ పరమైన ఇబ్బందులు వస్తాయన్నారు. ముఖ్యంగా రకుల్‌ ఓ కేసు విషయమై జైలు కెళ్లే అవకాశం ఉందని కూడా షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.


Next Story