వెన్నెల కిషోర్ హీరోగా నటించిన సినిమా ఓటీటీలోకి వచ్చేసింది

టాలీవుడ్ కమెడియన్, వెన్నెల కిషోర్ హీరోగా నటించిన చారి 111 చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది.

By Medi Samrat  Published on  5 April 2024 9:15 PM IST
వెన్నెల కిషోర్ హీరోగా నటించిన సినిమా ఓటీటీలోకి వచ్చేసింది

టాలీవుడ్ కమెడియన్, వెన్నెల కిషోర్ హీరోగా నటించిన చారి 111 చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది. ఇందులో సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. దర్శకుడు ఈ చిత్రాన్ని ఫ్రాంచైజీగా ప్లాన్ చేశాడు. సినిమా పరాజయం పాలవ్వడంతో సీక్వెల్ లు రావడం కష్టమే.

చారి 111 చిత్రం ఇప్పుడు OTTలో ప్రసారం అవుతోంది. ఈ చిత్రం ప్రముఖ OTT జెయింట్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. థియేటర్లలో చూడటం మిస్ అయిన చాలా మంది వెన్నెల కిషోర్ సినిమాని ఈ వీకెండ్ లో హ్యాపీగా చూసేయొచ్చు. చారి 111 కు తప్పకుండా ఓటీటీలో మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. చారి 111 సినిమాలో హీరోయిన్ గా చేసిన సంయుక్త విశ్వనాథన్ ఇటీవల తన మ్యూజిక్ వీడియో ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆమె నటించిన పాట యూట్యూబ్‌లో 74 మిలియన్ల వ్యూస్ ను సాధించింది. అయితే ఆమెకు ఉన్న పాపులారిటీ ఈ సినిమా ఫేట్‌ ను మార్చడానికి ఉపయోగపడలేదు. అలాగే విజయవంతమైన కమెడియన్ అయిన వెన్నెల కిషోర్ కూడా ఈ సినిమాను థియేటర్లలో కాపాడలేకపోయాడు.

Next Story