'గని' ఫస్ట్ పంచ్ పడింది.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

Varun Tej packs a punch in Ghani teaser. వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న సినిమా 'గని'. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ పంచ్

By Medi Samrat  Published on  6 Oct 2021 7:52 PM IST
గని ఫస్ట్ పంచ్ పడింది.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న సినిమా 'గని'. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ పంచ్ వీడియోను రిలీజ్ చేశారు. ఎన్నో సినిమాల మీద చూపినట్లుగానే కరోనా లాక్ డౌన్ ప్రభావం ఈ సినిమాపై కూడా పడింది. ఈ సినిమాను 'దీపావళి' కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ తరువాత వాయిదా వేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి 'గని' ఫస్టు పంచ్ పేరుతో ఒక వీడియోను వదిలి రిలీజ్ డేట్ ను కూడా చెప్పేశారు. డిసెంబర్ 3వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో దర్శకుడిగా కిరణ్ కొర్రపాటి పరిచయమవుతున్నాడు.


తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ మెరవనుంది. తెలుగులో ఆమె చేసిన తొలి సినిమా ఇదే. సల్మాన్ ఖాన్ దబంగ్ సిరీస్ లో కనిపించినా.. పెద్దగా పేరు రాలేదు. ఈ సినిమాతో అయినా అమ్మడికి స్టార్డమ్ వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం వరుణ్ తేజ్ 'ఎఫ్ 3' సినిమా షూటింగులో కూడా బిజీగా ఉన్నాడు. అతి త్వరలో గని సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమా వచ్చిన రెండు వారాలకు 'పుష్ప' సినిమా రిలీజ్ కూడా ఉంది.


Next Story