'గని' రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పేసిన చిత్ర బృందం!

Varun Tej Ghani Movie Release Date Announced. టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం గని రిలీజ్ డేట్ చెప్పిన చిత్ర బృందం.

By Medi Samrat  Published on  28 Jan 2021 11:49 AM IST
Varun Tej Ghani Movie Release Date Announced

టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం గని. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో బాక్సర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తూ తెరకెక్కే ఈ సినిమాను నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించనున్నారు. చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్.. జనవరి 19న వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా టైటిల్ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేశారు. ఈ పోస్టర్ లో బాక్సింగ్ రింగ్ లో పంచులు కొడుతూ చూస్తున్న వరుణ్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది.


అయితే.. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మరొక అప్డేట్ ను ఇచ్చింది చిత్రబృందం. సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశారు. జూలై 30న గని రింగులో దిగనున్నట్లు తెలిపారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కోచ్ గా సునీల్ శెట్టి కనిపించనున్నారు. వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ దర్శక నటుడు మహేష్ మంజ్రేకర్‌ తనయ సయూ మంజ్రేకర్ న‌టిస్తోంది. హీరో నవీన్ చంద్ర కూడా ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. తమన్ ఈ చిత్రానికి స్వరాలను సమకూరుస్తున్నాడు.


Next Story