బన్నీ సినిమాలో పొలిటికల్ లీడర్‌గా తడాఖా చూపనున్న తమిళ ముద్దుగుమ్మ
Varalakshmi Sarathkumar Acts In Allu Arjun Movie. కొరటాల శివ డైరెక్షన్‌లో బన్నీ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 1 March 2021 12:01 PM ISTకొరటాల శివ డైరెక్షన్‌లో బన్నీ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. #AA21గా రానున్న ఈ సినిమాలోని ప్రథమార్థంలో స్టూడెంట్ లీడర్‌గా, ద్వితీయార్థంలో రాజకీయ నాయకుడిగా బన్నీ కనిపిస్తారని ఎన్నో రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ స్టార్ కుమార్తె కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది.
నటుడు శరత్ కుమార్ కుమార్తె నటి వరలక్ష్మీ ఈ సినిమాలో నటించనున్నారని సమాచారం. ఇప్పటికే 'క్రాక్' సినిమాలో జయమ్మగా, 'నాంది' సినిమాలో ఆద్యగా మెప్పించి తెలుగువారికి చేరువైన వరలక్ష్మీ, బన్నీ సినిమాలో రాజకీయ నాయకురాలిగా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా గురించి ఇప్పటికే చిత్ర బృందం ఆమెను సంప్రదించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయమై ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ఇదిలా ఉంటే.. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌తో అల్లు అర్జున్ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం తర్వాత బన్నితో ఓ సినిమా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నట్లు సమాచారం. ఇక సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప సినిమా షూటింగ్ వేగంగా జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సినిమా విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే మూడో చిత్రం ఇది కాగా.. అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని భావిస్తున్నారు.