'వ‌కీల్ సాబ్' క్లైమాక్స్ ఫోటోలు వైర‌ల్‌

Vakeel Saab climax shoot photos goes viral.ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం 'వ‌కీల్ సాబ్‌' క్లైమాక్స్ ఫోటోలు వైర‌ల్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Jan 2021 4:46 AM GMT
Vakeel Saab climax shoot

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం 'వ‌కీల్ సాబ్‌'. రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌డంతో.. ప‌వ‌న్ కొంత కాలం సినిమాల‌కు విరామం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ రీ ఎంట్రీ ఫిల్మ్‌గ చెబుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌తి అప్‌డేట్ ప‌వ‌న్ అభిమానుల‌ను అల‌రిస్తుంది. శృతిహాస‌న్‌, అంజ‌లి, నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా తెర‌కెక్కుతోంది. ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంటోంది. మార్చిలో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది.


సంక్రాంతి కానుక‌గా ఈ చిత్ర టీజ‌ర్ వ‌స్తుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు. ప‌వ‌న్ అభిమానుల‌కు ప్ర‌ముఖ న‌టుడు దేవ్ గిల్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. త‌న‌ సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ ఫోటోలు పంచుకున్నాడు. దీంతో ఇవి ఒక్క‌సారిగా వైర‌ల్ అయ్యాయి. దీనిని బట్టి సినిమాలో చాలానే మార్పులు చేర్పులు చేసారని అర్ధం అవుతుంది, మరి మేకర్స్ ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కించారో తెలియాలి అంటే టీజర్ వరకు ఆగాల్సిందే.
Next Story
Share it