ఊహించని డేంజర్ లో ఉస్తాద్ భగత్ సింగ్
థెరి సినిమా.. 2016లో వచ్చింది ఈ సినిమా. తెలుగులో పోలీసోడు పేరుతో విడుదలైంది.
By Medi Samrat Published on 30 Dec 2024 9:30 PM IST
థెరి సినిమా.. 2016లో వచ్చింది ఈ సినిమా. తెలుగులో పోలీసోడు పేరుతో విడుదలైంది. టీవీలో కూడా ఈ సినిమా మంచి హిట్ అయింది. ఈ సినిమాను హిందీలో 'బేబీ జాన్' గా కొన్ని మార్పులు చేసి విడుదల చేశారు. అయితే ఇది ఏ మాత్రం అక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు తెలుగులో పవన్ కళ్యాణ్ లీడ్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారేమోననే అనుమానాలు మొదలయ్యాయి.
పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పని చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైనప్పటికీ పవన్ కళ్యాణ్ రాజకీయ కమిట్ మెంట్ కారణంగా ఆగిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ ను పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ఇతర రెండు చిత్రాలైన హరి హర వీర మల్లు, OG చిత్రాలకు సమయం కేటాయిస్తున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ కూడా షూటింగ్ పునఃప్రారంభం గురించి ఎలాంటి క్లూ ఇవ్వలేదు.
హిందీలో రీమేక్ రిజల్ట్ ఉస్తాద్ టీమ్ ను బాగా టెన్షన్ పెడుతూ ఉంది. పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని భావించిన బేబీ జాన్ ను ప్రేక్షకులు పూర్తిగా తిరస్కరించారు. ఈ చిత్రం 30 కోట్ల నెట్ మార్క్‌ను టచ్ చేయడానికి కూడా కష్టపడుతోంది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితంపై అభిమానులు, ప్రేక్షకులు కూడా సందేహిస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, థెరి చిత్రం తెలుగు వెర్షన్‌లో థియేటర్‌లలో, టీవీలో కూడా మంచి వ్యూవర్ షిప్ ను సాధించింది. బేబీ జాన్‌కు జరిగినట్లుగా ఉస్తాద్ భగత్ సింగ్‌కు కూడా జరిగితే చాలా కష్టమే.