ఓటీటీలో ఉప్పెన సినిమా

Uppena Movie Release In OTT. తెలుగులో మరో సినిమా ఓటీటీలో విడుదలకానుంది. మెగా హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్

By Medi Samrat  Published on  15 Dec 2020 3:31 PM IST
ఓటీటీలో ఉప్పెన సినిమా

తెలుగులో మరో సినిమా ఓటీటీలో విడుదలకానుంది. మెగా హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నసినిమా 'ఉప్పెన' సినిమా కూడా ఓటీటీ బాట పట్టింది. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఓటీటీలలో విడుదల అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. త‌న సుకుమార్‌ రైటింగ్స్ బ్యాన‌ర్ మీద తీయ‌డం కూడా సినిమా మీద‌ మంచి అంచనాలు ఉన్నాయి. సుకుమార్ శిశ్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమా లాక్ డౌన్ కారణంగా విడుదలకు నోచుకోలేదు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఉప్పెన చిత్రాన్ని నిర్మించారు.

దాదాపు 18 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఓటీటీ సంస్థ మంచి ఆఫర్‌ను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు ఈ సినిమాను నెట్‌ప్లిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టి నటించగా, తమిళ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ముఖ్య పాత్ర పోషించాడు. ఈ సినిమా ట్రైలర్, నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ ఎప్పుడు అన్నది త్వరలోనే తెలియనుంది.




Next Story