హాస్య నటులు రేలంగి గురించి ఆసక్తికర విషయాలు..
Unknown Facts About Relangi Venkatramaiah. తెలుగు హాస్య నటులు రేలంగి గురించి ఆసక్తికర విషయాలు.
By Medi Samrat Published on 27 Feb 2021 9:45 PM ISTపాతాళ భైరవి సినిమాలో అమాయకుడిగా నటించారు. మిస్పమ్మ, అప్పుచేసి పప్పుకూడు, సువర్ణసుందరి, లవకుశ, సత్యహరిశ్చంద్ర, మయాబజార్, నర్తనశాల వంటి విజయవంతమైన సినిమాలలో నటించారు. మాయాబజార్ లో రేలంగి కామెడీకి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఎన్నో అద్బుతమైన చిత్రాల్లో నటించిన ఆయన పర్సనాలిటీ లావైనా తనదైన కామెడీ తో చిరునవ్వులు చిందింపజేసేవారు. ఇతని భార్య పేరు బుచ్చియమ్మ. భార్య భర్తలిరువురూ దైవభక్తులు.
ఈ దంపతులకు సత్యనారాయణ ఏకైక సంతానం. వీరు ఎంత స్థితిమంతులు అయినా.. పేదరికంలో ఉన్నపుడు తనకు పిల్లనిచ్చిన బావమరిది కూతురునే తన తనయుడికి ఇచ్చి పెళ్లి చేశారు. రేలంగి సహృదయులు. ఎన్నో కళాశాలలకు విరాళాలిచ్చారు. చాలామందికి వివాహాలకు సహాయం చేసేవారు. రేలంగి ఇంట నిత్యం అన్నదానాలు జరిగేవి. తాడేపల్లి గూడెం అంటే రేలంగికి ప్రత్యేకమైన అభిమానం. చివరి దశలో మాత్రం ఆయన తీవ్రమైన నడుము నొప్పితో బాధపడ్డారు. ఇది ఎముకలకు సంబంధించిన వ్యాధిగా డాక్టర్లు తేల్చారు. 1975 నవంబర్ 26 ఉదయాన తాడేపల్లి గూడెంలోని తన స్వంత ఇంట్లో కీర్తిశేషులయ్యారు.