డిసెంబర్ 17 శుక్రవారం పాన్-ఇండియా చిత్రం 'పుష్ప-ది రైజ్' థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకోబోతోందని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు. భారీ బుకింగ్స్ తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి. 'పుష్ప' అల్లు అర్జున్ 'వన్ మ్యాన్ షో'గా చెబుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప' సినిమాలో ఏదో మిస్సింగ్ అయిందనే టాక్ నడుస్తోంది. థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు సినిమాలోని సౌండ్ మిక్సింగ్ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం కొద్ది సమయం మాత్రమే తీసుకున్న మేకర్స్.. విడుదలకు ముందు వరకూ కూడా సినిమాకు సంబంధించిన సౌండ్ మిక్సింగ్ పనులు చేసినట్లు ఉన్నారు.
సినిమాలో మాంచి ఎలివేషన్ సీన్ దగ్గర నాసి రకం సౌండ్ వినిపించిందని అభిమానులు సోషల్ మీడియాలో కూడా తమ వాదనను వినిపించారు. BGM నాణ్యత, సౌండ్‌లు దీని ద్వారా బాగా ప్రభావితమయ్యాయి. సినిమా అవుట్‌పుట్‌తో ప్రేక్షకులు పెద్దగా సంతోషంగా లేరు. 'పుష్ప' టీమ్ ముందుగా చెప్పినట్లు గత కొద్ది రోజులుగా సౌండ్ మిక్సింగ్ జరుగుతోంది. ప్రమోషనల్ ఈవెంట్‌లకు కూడా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ దూరంగా ఉన్నాడు. ఇచ్చిన సమయానికి పనులు జరిగేలా చేయడానికి అహోరాత్రులు శ్రమించారు. కానీ అవుట్ పుట్ మాత్రం అంత గొప్పగా లేదని సినిమా చూశాక ప్రేక్షకులు చెబుతూ ఉన్నారు.