ట్విట్టర్ లో బండి సంజయ్ వర్సెస్ కల్వకుంట్ల కవిత

Tweet War Between Kalvakuntla Kavitha And Bandi Sanjay. ట్విటర్ వేదికగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల

By Medi Samrat  Published on  13 Jun 2023 8:16 PM IST
ట్విట్టర్ లో బండి సంజయ్ వర్సెస్ కల్వకుంట్ల కవిత

ట్విటర్ వేదికగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల మధ్య ట్విట్టర్ వార్ జరుగుతూ ఉంది. బండి సంజయ్ తొలుత బీఆర్ఎస్ విధానాలను విమర్శిస్తూ ఒక ట్వీట్ చేయగా, అందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీటుగా స్పందించారు. బండి సంజయ్ కవిత ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

బండి సంజయ్ చేసిన ట్వీట్ లో ‘‘గవర్నర్ కు దక్కదు గౌరవం, ఆడబిడ్డలకు లేదు అండ, గిరిజన మహిళలపై పోలీస్‌ గిరీ, బతుకమ్మను అవమానపరిచినోడితో ఆలింగనం, ఇంటి బిడ్డకు మాత్రం బలగంతో నిలబడతవ్ అడ్డం. అదిరింది కేసీఆర్ నీ మహిళా సంక్షేమం’’ అని బండి సంజయ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై కల్వకుంట్ల కవిత స్పందిస్తూ.. ‘‘పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి దక్కదు గౌరవం, దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు రాత్రింబవళ్ళు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవు, దేశరాజధాని నడి వీధుల్లో ఆడబిడ్డలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వైనం, నినాదాలకే పరిమితమైన భేటీ బచావో... భేటీ పడావో, సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కిచెన్ లో కన్నీళ్లు తెప్పిస్తున్న దుస్థితి, మహిళకు విద్యా, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం, ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యం, ఆడబిడ్డ తలుచుకుంది.. ఇక మీ అడ్రస్ గల్లంతవుతుంది’’ అని కవిత కౌంటర్ ట్వీట్ చేశారు.


Next Story