టీవీకే చీఫ్‌ విజయ్‌కు భారీ షాక్.. విడాకులు కావాలంటూ కోర్టుకు భార్య

తమిళ నటుడు, టీవీకే చీఫ్‌ విజయ్‌కు భారీ షాక్‌ తగిలింది. పాతికేళ్లకు పైగా వివాహం బంధం తర్వాత ఆయన భార్య సంగీత సోర్నలింగం విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు.

By -  Medi Samrat
Published on : 27 Feb 2026 7:50 PM IST

టీవీకే చీఫ్‌ విజయ్‌కు భారీ షాక్.. విడాకులు కావాలంటూ కోర్టుకు భార్య

తమిళ నటుడు, టీవీకే చీఫ్‌ విజయ్‌కు భారీ షాక్‌ తగిలింది. పాతికేళ్లకు పైగా వివాహం బంధం తర్వాత ఆయన భార్య సంగీత సోర్నలింగం విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. విజయ్ వివాహేతర సంబంధమే విడాకులకు కారణమంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధంలో ఉన్నారని సంగీత ఆరోపించింది. 2021లో ప్రతివాది ఒక నటితో అక్రమ సంబంధం ఉందని, అయితే ఆ సంబంధాన్ని ముగించాలని హామీ ఇచ్చిన తర్వాత కూడా విజయ్‌లో మార్పులేదని పాత ధోరణే కొనసాగుతోంది అన్నది సంగీత ప్రధాన అరోపణ. అందుకే భర్తనుంచి చట్టబద్ధంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 27(1)(a) మరియు 27(1)(d) కింద సంగీత విడాకులకు దరఖాస్తు చేశారు. 1999 ఆగస్టులో ప్రేమవివాహం చేసుకున్న ఈ జంటకు జాసన్ సంజయ్ , దివ్య షాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Next Story