సెట్స్ లోనే ఆత్మహత్య చేసుకుని మరణించిన సీరియల్ నటి

TV actress Tunisha Sharma dies by suicide on sets of her show. టెలివిజన్ ఇండస్ట్రీలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

By Medi Samrat
Published on : 24 Dec 2022 7:22 PM IST

సెట్స్ లోనే ఆత్మహత్య చేసుకుని మరణించిన సీరియల్ నటి

టెలివిజన్ ఇండస్ట్రీలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అలీ బాబా: దస్తాన్-ఈ-కాబుల్ లో పనిచేస్తున్న టీవీ నటి తునీషా శర్మ ఇక లేరు. ముంబైలోని సెట్స్‌ లో ఆమె విగతజీవిగా కనిపించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తన టీవీ షో, అలీ బాబా అలీ బాబా: దస్తాన్-ఈ-కాబూల్ షూటింగ్‌లో ఉంది. ఆమె తన జీవితాన్ని మేకప్ రూమ్‌లో ముగించింది. తునీషాను ఆసుపత్రికి తరలించగా, ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఆమె వయస్సు కేవలం 20 సంవత్సరాలు.

తునీషా బాలనటిగా కూడా రాణించింది. కత్రినా కైఫ్, విద్యాబాలన్ వంటి తారలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. తునీషా 'ఫితూర్‌' సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ సినిమాలో ఆమె చిన్ననాటి కత్రినా కైఫ్‌గా నటించింది. బార్ బార్ దేఖోలో కూడా కనిపించింది. ఆమె కహానీ 2లో విద్యాబాలన్‌తో స్క్రీన్‌ను పంచుకుంది. పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించింది. ఆమె మరణానికి గల కారణం తెలియాల్సి ఉంది.


Next Story