పుష్ప విలన్.. ఎవరూ ఊహించని స్టార్..!
Top Malayali Actor As Villain In 'Pushpa'. తాజాగా పుష్పచిత్రంలో విలన్ పాత్రకు మలయాళం స్టార్ ను తీసుకున్నారు.
By Medi Samrat Published on 21 March 2021 2:01 PM ISTపుష్ప.. ఇప్పటికే ఈ సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అవ్వగా.. ఈ సినిమాలో నటించబోతున్న స్టార్స్ కారణంగా ఇది మరింత పెద్ద ప్రాజెక్ట్ అవ్వబోతోంది. ఎందుకంటే తాజాగా ఈ చిత్రంలో విలన్ పాత్రకు మలయాళం స్టార్ ను తీసుకున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు ప్రతి నాయకుడుగా చాలా మంది స్టార్స్ పేర్లు వినిపించాయి. తమిళ హీరో విజయ్ సేతుపతి, ఆర్య అని వార్తలు వినిపించాయి. తాజాగా పుష్ప విలన్‌పై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు అఫిషీయల్ అనౌన్స్‌మెంట్ చేసింది పుష్ప టీం.
Welcoming #FahadhFaasil on board for the biggest face-off 😈@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @PushpaMovie #VillainOfPushpa #Pushpa
— Mythri Movie Makers (@MythriOfficial) March 21, 2021
పుష్ప പുഷ്പ புஷ்பா ಪುಷ್ಪ पुष्पा pic.twitter.com/ndweB09rXi
మళయాళం స్టార్ హీరో ఫాహద్ పాసిల్ ను పుష్ప సినిమాలో విలన్ గా తీసుకున్నారు. అల్లు అర్జున్‌ను ఢీ కొట్టేందుకు ఫాహద్ పాసిల్ వస్తున్నాడంటూ చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఫాహద్ మలయాళంలో పెద్ద స్టార్.. మలయాళంకు మాత్రమే పరిమితం అవ్వకుండా.. వివిధ భాషల్లోనూ ఫాహద్ నటిస్తూ ఉన్నాడు. పుష్ప సినిమాలో అతడు నటిస్తూ ఉన్నాడు. ఫాహద్ కు ఇది తొలి తెలుగు సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగిపోతూ ఉన్నాయి. నటి నజ్రియా నాజిమ్ భర్తనే ఫాహద్ పాసిల్..!
ఆగస్ట్ 13న సినిమా దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మికా మందాన బన్నీ సరసన నటిస్తోంది. ఈ సినిమా శేషాచల అడవుల్లో మాత్రమే దొరికే ఎర్రచందనం, దానికి సంబంధించిన స్మగ్లింగ్‌పై రూపొందుతోంది. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్స్‌ను కేరళ, మారేడు మిల్లి, రంపచోడవరంలోని అటవీ ప్రాంతాల్లో చిత్రీకరించారు.