ఐటమ్ సాంగ్స్ తో సూపర్ గా సంపాదిస్తున్న బ్యూటీలు.!
Tollywood Trending Item Girls. హీరోయిన్లే ఐటమ్ సాంగ్ లో కనిపించే రోజులు వచ్చాయి.సూపర్ గా సంపాదిస్తున్న బ్యూటీలు.
By Medi Samrat
సన్నీలియోన్ కూడా అడపాదడపా ఐటమ్ సాంగ్స్‌లలో కనిపిస్తోంది. కాకపోతే వీరి రెమ్యూనరేషన్ కొంత మంది నిర్మాతలకు మింగుడు పడకుండా ఉంది. దాంతో అప్ కమింగ్ హీరోయిన్లు, చిన్న హీరోయిన్లపై కన్నేశారు. స్టార్ హీరోయిన్ రెమ్యూనరేషన్ లో సగం కంటే తక్కువ ఇస్తే చాలు వాళ్ళను మించి అందాలు ఆరబోస్తున్నారు. 10-15 లక్షలకే బోల్డ్ బ్యూటీస్ చాలా మందే అందుబాటులోకి వచ్చేశారు.
బిగ్ బాస్ 4 సీజన్ తో గుర్తుంపు తెచ్చుకున్న మోనాల్ గజ్జర్ "అల్లుడు అదుర్స్" సినిమాలో ప్రత్యేక గీతంలో మెరిసింది. 'రెడ్' మూవీ హెబ్బా పటేల్ ను ఐటెం గర్ల్ గా అదరగొట్టింది. అప్సరా రాణి "క్రాక్" మూవీలో భూమ్ బద్దలంటూ కుర్రకారు మతులు పోగొట్టింది. ఇదంతా ఒక ఎత్తైతే జబర్ధస్త్ తో హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ కూడా ఐటమ్ సాంగ్స్ కి రెడీ అంటుంది. గతంలో "విన్నర్" మూవీలో ఆడిపాడిన ఈ యాంకరమ్మ "చావు కబురు చల్లగా" సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుందని దానికోసం భారీగానే రెమ్యూనరేషన్ అందుకోనున్నట్లు టాలీవుడ్ టాక్.