మధ్య సినిమా హాళ్లలో సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయా అనే అంశం కంటే.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అని సినీ అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఇలానే కొనసాగుతూ ఉంటే సినిమా హాళ్లలో సినిమాలు చూసే వారే కరువవుతారనే ఆందోళనలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో టాలీవుడ్ నిర్మాతలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు సినిమాలను ఓటీటీలో విడుదల చేయడంపై టాలీవుడ్ నిర్మాతలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాత మాత్రమే సినిమాలను ఓటీటీకి ఇవ్వాలని నిర్మాతలు బుధవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
జులై 1 తర్వాత ఒప్పందాలు జరిగే సినిమాలకే ఈ నిబంధన వర్తింపజేయాలని కూడా వారు నిర్ణయించారు. ఓటీటీలోకి వెంటనే సినిమాలు విడుదల అవుతుండటంతో అగ్ర హీరోలకు భారీ నష్టం జరుగుతోందని, వారి ఇమేజీ కూడా తగ్గిపోతోందని భావిస్తూ ఉన్నారు. దీనిపై ఓ నిర్ణయం తీసుకునేందుకు నిర్మాతలు బుధవారం సమావేశం అయ్యారు. థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాత మాత్రమే సినిమాలను ఓటీటీకి ఇవ్వాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు.