టాలీవుడ్ హీరో నాగ శౌర్యకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

Tollywood hero Naga Shaurya is sick.. shifted to hospital. టాలీవుడ్ హీరో నాగ శౌర్య అస్వస్థతకు గురయ్యారు. సోమవారం షూటింగ్ లో ఉండగా అతడు

By Medi Samrat
Published on : 14 Nov 2022 4:27 PM IST

టాలీవుడ్ హీరో నాగ శౌర్యకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

టాలీవుడ్ హీరో నాగ శౌర్య అస్వస్థతకు గురయ్యారు. సోమవారం షూటింగ్ లో ఉండగా అతడు సొమ్మసిల్లి పడిపోయినట్లు సమాచారం. దీంతో నాగశౌర్యని హుటాహుటిన హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నాగశౌర్య త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్​ డిజైనర్ అనూష శెట్టి అనే అమ్మాయితో ఆయన వివాహం ఖరారైంది. ఈనెల 20న 11:25 గంటలకు వీరి వివాహం బెంగళూరులోని ఓ హోటల్‌లో ఘనంగా జరగనుంది. బెంగుళూరులో నాగ శౌర్య వివాహం అనూష శెట్టితో ఈనెల 20 న జరగబోతోందని.. ఇది ప్రేమ వివాహం అని నాగ శౌర్య తండ్రి తెలియచేశారు. అనూష శెట్టి బెంగుళూరు‌లో ఇంటీరియర్ డిజైనర్, ఆర్కిటెక్ట్ కూడా అని తెలిపారు.


Next Story