టాలీవుడ్ లో మరో విషాదం.. స్వప్న మృతి

టాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె వయసు 33 ఏళ్లు. తెలుగు సినీ పరిశ్రమలో కొన్నేళ్లుగా ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని ఉన్నారు.

By Medi Samrat  Published on  6 July 2024 6:53 PM IST
టాలీవుడ్ లో మరో విషాదం.. స్వప్న మృతి

టాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె వయసు 33 ఏళ్లు. తెలుగు సినీ పరిశ్రమలో కొన్నేళ్లుగా ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని ఉన్నారు. రాజమండ్రికి చెందిన స్వప్న ఇండస్ట్రీలో స్థిరపడాలని మూడేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చింది. మాదాపూర్ కావూరి హిల్స్ లోని తీగల హౌస్ అపార్ట్ మెంట్ లోని 101 ఫ్లాట్ లో ఆమె ఒంటరిగా ఉంటోంది. గత కొన్ని నెలలుగా తనకు ఎలాంటి ప్రాజెక్ట్ రాకపోవడంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్టు సమాచారం. ఆమె రెండు రోజుల క్రితం తన ఫ్లాట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. ఫ్లాట్ లో ఆమెతో పాటు ఎవరూ లేకపోవడంతో ఆమె ఆత్మహత్య విషయం బయటకు తెలియరాలేదు. బాడీ డీకంపోజ్ కావడం వల్ల చెడు వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

స్వప్న వర్మ ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం రావడంతో ఆమెతో కలిసి పని చేసిన పలువురు షాక్ కు గురయ్యారు. స్వప్న వర్మ ఎంతో ధైర్యవంతురాలని.. ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని అసలు అనుకోలేదని ఆమె సన్నిహితులు తెలిపారు.

Next Story