ఆ విషయంలో పూరీ జ‌గ‌న్నాథ్‌, త‌రుణ్‌ లకు క్లీన్ చిట్

Tollywood Drugs Case. 2017 లో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం సృష్టించిన డ్రగ్స్ కేసుకు సంబంధించిన

By Medi Samrat  Published on  18 Sep 2021 11:59 AM GMT
ఆ విషయంలో పూరీ జ‌గ‌న్నాథ్‌, త‌రుణ్‌ లకు క్లీన్ చిట్

2017 లో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం సృష్టించిన డ్రగ్స్ కేసుకు సంబంధించిన చర్చ కొనసాగుతూ ఉంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇక నాలుగేళ్ల క్రిత‌మే.. డ్ర‌గ్స్ టెస్ట్ కోసం పూరీ జ‌గ‌న్నాథ్‌, న‌టుడు త‌రుణ్‌.. త‌మ ర‌క్తం, వెంట్రుక‌లు, గోర్ల శాంపిల్స్‌ను ఈడీకి అందించారు. వీళ్లిద్ద‌రు మిన‌హా మిగ‌తా వాళ్లు ఎవ్వ‌రూ శాంపిల్స్ ఇవ్వ‌లేదు. అప్పుడే వీళ్ల శాంపిల్స్‌లో డ్ర‌గ్స్ ఆన‌వాళ్లు లేవ‌ని తేలింది. తాజాగా.. ద‌ర్శ‌కుడు పూరీ, త‌రుణ్ న‌మూనాల్లో డ్ర‌గ్స్ ఆన‌వాళ్లు 100 శాతం లేవ‌ని ఎఫ్ఎస్ఎల్‌(ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేట‌రీ) క్లీన్ చిట్ ఇచ్చింది.

పూరీ, త‌రుణ్‌కు సంబంధించిన ర‌క్తం, వెంట్రుక‌లు, గోర్ల‌ను ఎఫ్ఎస్ఎల్ ప‌రీక్షించి.. వాటిలో డ్ర‌గ్స్ ఆన‌వాళ్లు ఏమాత్రం లేవ‌ని తేల్చిచెప్పింది. పూరీ, త‌రుణ్‌ స్వ‌చ్ఛందంగానే త‌మ ర‌క్తం, గోర్లు, వెంట్రుక‌లు ఇచ్చార‌ని ఎక్సైజ్ శాఖ వెల్ల‌డించింది. పూరీ జగన్నాథ్‌, హీరో తరుణ్‌కు ఎఫ్ఎస్ఎల్ క్లీన్ చిట్ ఇచ్చింది. పూరీ జగన్నాథ్, తరుణ్ నుంచి సేకరించిన రక్తం, వెంట్రుకలు, గోళ్ల శాంపిళ్లలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎస్ పరీక్షల్లో తేలింది. ఈ విషయాన్ని తెలంగాణ ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ కేసు ఛార్జిషీట్‌లో పేర్కొంది. 2017 జులైలో పూరి జగన్నాథ్, తరుణ్ నుంచి ఎక్సైజ్ శాఖ నమూనాలు సేకరించింది. ఈ నమూనాలపై గతేడాది డిసెంబర్‌ 8న ఎక్సైజ్‌శాఖకు ఎఫ్ఎస్ఎస్ నివేదికలు సమర్పించింది.


Next Story
Share it