టాలీవుడ్ డ్రగ్స్ కేసు : రేపటి నుంచి ఈడీ విచారణ
Tollywood Drugs Case. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రేపటి నుంచి విచారణ చేపట్టనుంది.
By Medi Samrat Published on 30 Aug 2021 4:42 PM ISTటాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రేపటి నుంచి విచారణ చేపట్టనుంది. ఇప్పటికే ముగ్గురు నిందితులు దగ్గర నుంచి ఈడీ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది. ముగ్గురు ఇచ్చిన సమాచారంతో 12 మంది టాలీవుడ్ నటీనటులకు నోటీసులు జారీచేసింది. టాలీవుడ్ నటీనటుల విచారణ అనంతరం మరికొందరిపై ఈడీ దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ విచారించిన వారందరికీ ఈడీ నోటీసులు పంపే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఈ మేరకు డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ అధికారులు విచారించిన 50 మందికి ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మొత్తం 62 మందిని విచారించాలని ఈడీ ప్లాన్ చేసింది. డ్రగ్స్ కేసులో హవాలా, మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లుగా ఈడీ గుర్తించినట్లు సమాచారం. డ్రగ్స్ కొరకు పెద్ద మొత్తంలో విదేశాలకు నిధులను మళ్లించినట్లుగా గుర్తించారని తెలుస్తోంది. డ్రగ్స్ కొనుగోలు చేసి నిందితులకు హవాలా ద్వారా డబ్బులు తరలించారని గుర్తించినట్లు తెలుస్తోంది.
ఆగస్టు 31: పూరీ జగన్నాథ్
సెప్టెంబర్ 2: చార్మీ కౌర్
సెప్టెంబర్ 6: రకుల్ ప్రీత్ సింగ్
సెప్టెంబర్ 8: రాణా దగ్గుబాటి
సెప్టెంబర్ 9: రవితేజతో పాటు డ్రైవర్ శ్రీనివాస్
సెప్టెంబర్ 13: నవ్‌దీప్, ఎఫ్–క్లబ్ జనరల్ మేనేజర్
సెప్టెంబర్ 15: ముమైత్ ఖాన్
సెప్టెంబర్ 17: తనీష్
సెప్టెంబర్ 20: నందు
సెప్టెంబర్ 22: తరుణ్ .. ఇలా ఒక్కొక్కరిని ఒక్కో డేట్ లో అధికారులు విచారించనున్నారు