అమెరికాలో కూడా దుమ్ముదులుపుతున్న టిల్లు స్క్వేర్

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తోంది.

By Medi Samrat  Published on  2 April 2024 3:45 PM GMT
అమెరికాలో కూడా దుమ్ముదులుపుతున్న టిల్లు స్క్వేర్

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సినిమాకు సానుకూల సమీక్షలు కూడా రావడం.. మౌత్ టాక్ కూడా బాగుండడంతో వారాంతంలో బాక్సాఫీస్ వద్ద మంచి ప్రారంభాన్ని అందుకుంది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లకు పైగా వసూలు చేయగలిగింది. ఇక అమెరికాలో 2 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ మార్కును తాకడం ద్వారా మరో మైలురాయిని అధిగమించింది.

DJ టిల్లును అధిగమించకపోవచ్చని చాలామంది భావించారు. కానీ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సూపర్బ్ కామెడీ, వన్ లైనర్లతో సినిమాను ముందుకు తీసుకుని వెళ్ళాడు. ఈ చిత్రం ఇప్పటికే U.S.లోని బాక్సాఫీస్ వద్ద $2M మార్కును తాకింది. త్వరలో 3 మిలియన్ల మార్కును కూడా తాకుతుందని అంటున్నారు. రానున్న రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ మార్క్‌ను కూడా ఈజీగా దాటబోతోంది. ఏప్రిల్ 5న విడుదల కానున్న 'ఫ్యామిలీ స్టార్' కారణంగా కొంచెం కలెక్షన్స్ తగ్గొచ్చు. లాంగ్ రన్ లో మాత్రం టిల్లు స్క్వేర్ మంచి విజయాన్ని అందుకోనుంది.

Next Story