టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ ఎప్పుడంటే?
రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
By Medi Samrat Published on 26 Sept 2023 9:35 PM ISTరవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, పాటలు సినిమా మీద హైప్ ను పెంచాయి. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇండియన్ రాబిడ్ హుడ్‌గా పిలవబడే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ అధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. 70,80 దశకాల్లో నాగేశ్వరరావు ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ ఎత్తున దొంగతనాలు, దోపిడీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మేజర్ అప్‌డేట్‌ను చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ సినిమా ట్రైలర్ అప్‌డేట్‌ను మంగళవారం రాత్రి 8గంటలకు తెలిపారు. అక్టోబర్ 3న టైగర్ నాగేశ్వరరావు సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అఫీషియల్ ప్రకటనను అభిషేక్ అగర్వాల్ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. నోట్లో బీడీతో.. విలన్స్ మధ్యలో రవితేజ ఎంతో స్టైలిష్ గా ఉన్నారు.
ఈ సినిమాకు ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ఫేం వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. రేణుదేశాయ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.