గ‌త‌మంతా గాయాలే.. ఇప్పుడు అత‌ని పాట వినాలంటే టికెట్ రూ.15 ల‌క్ష‌లు..!

పంజాబీ గాయకుడు కరణ్ ఔజ్లాకు మంచి పాపులారిటీ ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన మూడు రోజుల పాటు సంగీత కచేరీని నిర్వహిస్తున్నారు.

By Medi Samrat  Published on  13 Nov 2024 9:23 AM GMT
గ‌త‌మంతా గాయాలే.. ఇప్పుడు అత‌ని పాట వినాలంటే టికెట్ రూ.15 ల‌క్ష‌లు..!

పంజాబీ గాయకుడు కరణ్ ఔజ్లాకు మంచి పాపులారిటీ ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన మూడు రోజుల పాటు సంగీత కచేరీని నిర్వహిస్తున్నారు. అయితే టిక్కెట్‌ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. డిసెంబర్ 17న జరగనున్న ఢిల్లీ కాన్సర్ట్ 'ఇట్ వాస్ ఆల్ ఎ డ్రీమ్ టూర్' టిక్కెట్లు రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు విక్రయిస్తున్నారు. కరణ్ ఔజ్లా హిందీ చిత్రం 'బాడ్ న్యూస్'లోని 'తౌబా తౌబా' పాటతో వెలుగులోకి వచ్చారు.

కరణ్ ఔజ్లా 'ఇట్ వాజ్ ఆల్ ఎ డ్రీమ్ టూర్' 7 డిసెంబర్ 2024న చండీగఢ్ నుండి ప్రారంభమవుతుంది. దీని తర్వాత డిసెంబర్ 13న బెంగళూరులో, డిసెంబర్ 15న న్యూఢిల్లీలో జరగనుంది. ఈ కచేరీ చివరి స్టాప్ డిసెంబర్ 21న ముంబైలో ఉంటుంది. బుక్ మై షోలో కరణ్ ఔజ్లా కచేరీకి సంబంధించిన టిక్కెట్లు మూడు విభాగాల్లో బుక్ అవుతున్నాయి.

వీవీఐపీ సిల్వర్ కేటగిరీ టిక్కెట్ల ధర రూ.5 లక్షలు, వీవీఐపీ గోల్డ్ కేటగిరీలో టికెట్ ధర రూ.10 లక్షలు. అత్యంత ఖరీదైన టికెట్ VVIP డైమండ్.. దీని ధర రూ. 15 లక్షలు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. కరణ్ ఔజ్లా కచేరీ 'ఇట్ వాస్ ఆల్ ఎ డ్రీమ్'కి వేదిక ఇంకా నిర్ణయించబడలేదు.

కరణ్ ఔజ్లా పూర్తి పేరు జస్కరన్ సింగ్ ఔజ్లా. కరణ్ 1997 జనవరి 18న పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా గురాలా గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులకు ఇతను ఒక్కడే కొడుకు. ఔజ్లాకు ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. కరణ్ తండ్రి మోటార్ సైకిల్ ప్రమాదంలో చనిపోయాడు. ఐదేళ్ల తర్వాత అతని తల్లి కూడా క్యాన్సర్‌తో మరణించింది. గాయకుడు కాకముందు.. ఔజ్లా కెరీర్ గీత రచయితగా ప్రారంభమైంది.

ది కెనడియన్ ఎన్‌సైక్లోపీడియా ప్రకారం.. కరణ్ ఔజ్లా కెనడియన్ పంజాబీలలో 'సాంగ్ మెషిన్'గా ప్రసిద్ధి చెందారు. ఔజ్లా యొక్క '52 బార్స్' 'టేక్ ఇట్ ఈజీ' కెనడా టాప్-10 వీడియోలలో స్థానం పొందాయి. 2024 సంవత్సరంలో ఔజ్లా టిక్‌టాక్ జూనో ఫ్యాన్ ఛాయిస్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డును అందుకున్న మొదటి పాండబీ కెనడియన్ ఇతను. 2024లో యాపిల్ మ్యూజిక్ అప్ నెక్స్ట్ ప్రోగ్రామ్‌లో ఔజ్లా కనిపించారు.

Next Story