రేపు 'పుష్ప' విడుదల.. ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఐదో షోకు అనుమ‌తి

The Telangana government has given permission for the fifth show of the movie 'Pushpa'. టాలీవుడ్‌ సినీ అభిమానులు ఎంతో ఉత్సుకతో ఎదురు చూస్తున్న సినిమా 'పుష్ప' రేపు విడుదల కానుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా

By అంజి  Published on  16 Dec 2021 4:21 PM IST
రేపు పుష్ప విడుదల.. ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఐదో షోకు అనుమ‌తి


టాలీవుడ్‌ సినీ అభిమానులు ఎంతో ఉత్సుకతో ఎదురు చూస్తున్న సినిమా 'పుష్ప' రేపు విడుదల కానుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. పాన్‌ ఇండియా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సుకుమార్‌ దర్శకత్వం వహించారు. డిసెంబర్‌ 17వ తేదీన అంటే రేపు ప్రపంచ వ్యాప్తంగా 'పుష్ప' సినిమా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్‌ అవబోతోంది. అల్లు అర్జున్‌ సినిమా కావడంతో అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. మరో వైపు ఈ సినిమాలో సమంత స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది. రష్మిక మందనా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

ఇదిలా ఉంటే.. 'పుష్ప' మూవీ మేకర్స్‌ తెలంగాణ ప్రభుత్వం శుభవార్తం చెప్పింది. 'పుష్ప' మూవీ ఐదో షోకు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. డిసెంబర్‌ 30వ తేదీ వరకు ఐదు షోలు నడుకుపుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం నిర్ణయంపై 'పుష్ప' సినిమా యూనిట్‌ ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంతో తక్కువ టైమ్‌లోనే 'పుష్ప' మూవీ నుండి మంచి వసూళ్లు రాబట్టొచ్చని తెలుస్తోంది. 'పుష్ప' సినిమా రెండు పార్టులుగా తెరకెక్కగా.. రేపు మొదటి పార్టు విడుదల కానుంది.

మొదటి పార్టులో సునీల్‌, యాంకర్‌ అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరో వైపు 'పుష్ప' మూవీ హిందీ వెర్షన్‌కు సెన్సార్‌ బోర్డు నుండి క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ రానట్లు తెలుస్తోంది. సర్టిఫికెట్‌ జారీ చేసే విషయంలో సెన్సార్‌ సభ్యులు నో చెప్పినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.


Next Story