రాజా సాబ్ బడ్జెట్, బ్రేక్ ఈవెన్.. వివరాలివే..!

మొదట్లో చిన్న సినిమాగా ప్లాన్ చేసిన రాజా సాబ్, ఇప్పుడు భారీ బడ్జెట్ హర్రర్ ఫాంటసీ ప్రాజెక్ట్‌గా మారింది.

By -  Medi Samrat
Published on : 5 Jan 2026 8:40 PM IST

రాజా సాబ్ బడ్జెట్, బ్రేక్ ఈవెన్.. వివరాలివే..!

మొదట్లో చిన్న సినిమాగా ప్లాన్ చేసిన రాజా సాబ్, ఇప్పుడు భారీ బడ్జెట్ హర్రర్ ఫాంటసీ ప్రాజెక్ట్‌గా మారింది. ఈ చిత్రం మొత్తం ₹350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించినట్లుగా నిర్మాతలు చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు మంచి మొత్తానికి అమ్ముడయ్యాయి. సంగీత హక్కులను T-సిరీస్ సొంతం చేసుకోగా, డిజిటల్, శాటిలైట్ హక్కులను స్టార్ గ్రూప్ (జియో హాట్‌స్టార్) సొంతం చేసుకుంది. ఈ నాన్-థియేట్రికల్ ఒప్పందాల ద్వారా సినిమా బడ్జెట్‌లో దాదాపు 50% ఇప్పటికే రికవరీ అయ్యింది.

ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹400 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్, ₹200 కోట్ల షేర్‌ను వసూలు చేస్తే సినిమా హిట్ అందుకున్నట్లే. ముఖ్యంగా ప్రభాస్ సినిమాలో ఉండడం, అదీ కాకుండా ప్రభాస్ కామెడీ చేస్తూ ఉండడంతో సినిమా హిట్ స్టేటస్ దక్కించుకోవడం పక్కా అనే అంటున్నారు. తెలుగు వెర్షన్ ఒక్కటే దాదాపు ₹290 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. అన్ని భాషల్లో కలిపి రాజా సాబ్ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ₹410 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. మంచి మౌత్ టాక్ తో ఇది ఖచ్చితంగా సాధించగల లక్ష్యం. మౌత్ టాక్ బలంగా ఉంటే, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల గ్రాస్ దాటవచ్చు.

Next Story