రామ్ చరణ్ అభిమానులకు షాక్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'గేమ్ చేంజర్'.
By Medi Samrat Published on 11 Nov 2023 6:06 PM ISTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'గేమ్ చేంజర్'. ఈ చిత్రం నుంచి దీపావళి కానుకగా 'జరగండి' అనే పాటను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అనుకోని కారణాలతో పాట విడుదల ఆలస్యం అయింది. వివిధ సంస్థల మధ్య ఆడియో డాక్యుమెంటేషన్ సమస్యల కారణంగా 'జరగండి' పాటను విడుదల చేయలేకపోతున్నామని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. పాట విడుదల వాయిదా వేశామని తెలిపింది. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని తెలిపింది. 'గేమ్ చేంజర్' నుంచి ఏ కంటెంట్ విడుదల అయినా అత్యుత్తమంగా ఉంటుందని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఓ ప్రకటనలో వివరించింది. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తమ చిత్రబృందం శ్రమిస్తోందని తెలిపింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. గేమ్ చేంజర్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా టీజర్, ట్రైలర్ల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల ఉండదనుంది.