ఓటీటీ విడుదలకు సిద్ధమైన‌ 'థాంక్యూ' .. ఎప్పుడంటే..

Thank You OTT Release Date And Time. నాగ చైతన్య హీరోగా న‌టించిన థాంక్యూ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలం అయ్యింది

By Medi Samrat
Published on : 3 Aug 2022 9:45 PM IST

ఓటీటీ విడుదలకు సిద్ధమైన‌ థాంక్యూ .. ఎప్పుడంటే..

నాగ చైతన్య హీరోగా న‌టించిన థాంక్యూ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలం అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. నష్టాన్ని పూడ్చుకోవడానికి నిర్మాత‌ దిల్ రాజు ముందుగానే OTT విడుదలకు వెళ్లాలని నిర్ణయించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఆగస్ట్ 12న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఓటిటి డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అయినటువంటి అమెజాన్, సన్ నెక్స్ట్ వాళ్లు కొనుగోలు చేసినట్లు సమాచారం.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లో ఆగస్ట్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. సినిమాలో రాశి ఖన్నా, మాళవిక నాయర్, సాయి సుశాంత్ రెడ్డి, అవికా గోర్ కలిసి నటించారు. నాగచైతన్యకు సూపర్‌హిట్ అందించిన మ‌నం డైరెక్ట‌ర్ విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాగచైతన్య లాల్ సింగ్ చద్దా సినిమాలో నటించాడు. ఇందులో బాలరాజు పాత్రలో కనిపించనున్నారు. తర్వాతి శుక్రవారం ఈ సినిమా విడుదల కాబోతోంది.

Next Story