నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా తండేల్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్స్ ను సాధించింది. ఈ సినిమా నాగ చైతన్య కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్ డే గ్రాస్‌ను నమోదు చేసింది. మొదటి రోజున తండేల్ ప్రపంచవ్యాప్తంగా రూ. 21.27 కోట్ల భారీ గ్రాస్ వసూలు చేసింది. శని, ఆదివారాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్‌లు భారీగా ఉండడంతో తండేల్ మొదటి వారాంతంలో రూ. 50 కోట్ల వసూళ్లు సాధిస్తుందని ఆశిస్తూ ఉన్నారు.
ఇక ఉత్తర అమెరికాలో ఈ చిత్రం $500K మైలురాయిని చేరుకుంటోంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన తండేల్ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సౌండ్‌ట్రాక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఒక గ్రిప్పింగ్ డ్రామాను చూడడానికి సినీ అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.