తమ్మారెడ్డి భరద్వాజ నుండి ఊహించని రిప్లై.. ఈ మెరుపు దాడి అసలు ఊహించి ఉండరు

Thammareddy Bharadwaj. ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు తమ్మారెడ్డి భరద్వాజ్ తనను విమర్శిస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు.

By Medi Samrat  Published on  10 March 2023 7:01 PM IST
తమ్మారెడ్డి భరద్వాజ నుండి ఊహించని రిప్లై.. ఈ మెరుపు దాడి అసలు ఊహించి ఉండరు

Thammareddy Bharadwaj


ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు తమ్మారెడ్డి భరద్వాజ్ తనను విమర్శిస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను నోరు తెరిచి ఒక్కొక్కడి అకౌంట్స్ చెపితే అసలు తట్టుకోగలరా అని ఆవేశంగా అన్నారు. నేను ఏమైనా కామెంట్ చేస్తే ఎవరో ఒకరు అది రాద్ధాంతం చేసి మాట్లాడుతూ వుంటారు, నేను పట్టించుకోను. కానీ ఈసారి ఇండస్ట్రీ మనుషులే నా గురించి మాట్లాడుతుంటే ఇంక ఊరుకోలేక వారికి సమాధానం చెప్పాలని అనుకున్నాను, అని అన్నారు తమ్మారెడ్డి. మనుషలకి సమాధానం చెప్పక్కరలేదు, కానీ ఇండస్ట్రీ కి చెప్పాలనుకున్నాను.. అందుకనే ఈ వివరణ అని అన్నారు తమ్మారెడ్డి. తాను ఆర్.ఆర్.ఆర్ మీద మాట్లాడినదానికి చాలామంది ట్విట్టర్ లో, ఇంకొందరు ఇంకో విధంగా ఎవడికి తోచిన విధంగా వాళ్ళు దీని మీద స్పందించారు. అయితే ఇప్పటికీ నేను ఏమన్నానో దానికి కట్టుబడే వున్నాను. నేను తప్పు చెయ్యలేదు కాబట్టి క్షమాపణ చెప్పను. ఇంతకు ముందు రాజమౌళి భారత్ కి ప్రైడ్ అంటే ఎవడూ పట్టించుకోలేదు. అలాగే ట్రిపిల్ ఆర్ భారత దేశానికి గర్వకారణం అంటే ఎవడూ మాట్లాడలేదు, కానీ ఇప్పుడు ఒక క్లిప్పింగ్ తీసుకొని దాని గురించి తెలియకుండా ఇంత రాద్ధాంతమా అని ప్రశ్నించారు తమ్మారెడ్డి. ఏ సందర్భంలో అన్నానో, ఎక్కడ అన్నానో చూడకుండా, ఒక చిన్న క్లిప్పింగ్ పట్టుకొని నీకు అకౌంట్స్ తెలుసా అని అడుగుతారా అని అన్నారు తమ్మారెడ్డి. నాకు చాలామంది అకౌంట్స్ తెలుసు, అవార్డుల కోసం ఎవడి కాలు ఎవడు పట్టుకున్నాడో కూడా నాకు తెలుసు. పదవుల కోసం ఎవడు ఎవడిని అడుక్కున్నారో కూడా నాకు తెలుసు, నేను అందరి అకౌంట్స్ గురించి నోరు విప్పితే ఎక్కడుంటారు మీరు అని తమ్మారెడ్డి నుండి ఊహించని ఎదురుదాడి మొదలైంది.

ఓ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ బ‌డ్జెట్‌పై వ్యాఖ్య‌లు చేశారు. ఆర్ఆర్ఆర్ ను రూ.600 కోట్లు పెట్టి తీశార‌ని, ఇప్పుడు ఆస్కార్ ప్ర‌మోష‌న్స్ కోసం రూ.80 కోట్లు ఖ‌ర్చు చేసింద‌ని ఆరోపించారు. ఆ రూ.80కోట్ల‌ను త‌న‌కు ఇస్తే ఎనిమిది సినిమాలు తీసి మీ మొఖాన కొడ‌తానంటూ త‌మ్మారెడ్డి అన్నారు.


Next Story