తమ్మారెడ్డి భరద్వాజపై రాఘవేంద్రరావు ఆగ్రహం
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్‌పై తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలపై రాఘవేంద్రరావు మండిపడ్డారు
By తోట వంశీ కుమార్ Published on 10 March 2023 11:15 AM ISTతమ్మారెడ్డి భరద్వాజ, ఆర్ఆర్ఆర్, రాఘవేంద్రరావు
'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ ప్రమోషన్స్‌పై టాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలపై నెటీజన్లతో పాటు పలువురు సినీ ప్రముఖుల నుంచి విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మండిపడ్డారు.
"తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకు ప్రపంచ వేదికలపై మొదటిసారి వస్తున్న పేరును చూసి గర్వపడాలి. అంతేకానీ 80 కోట్ల ఖర్చు అని చెప్పడానికి మీ దగ్గర అకౌంట్స్ ఏమైనా ఉన్నాయా..? జేమ్స్ కామెరాన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బులు తీసుకుని మన సినిమా గొప్పదనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా?" అని రాఘవేంద్రరావు ప్రశ్నల వర్షం కురిపించారు. అటు మెగాబ్రదర్ నాగబాబు కూడా ఘాటుగా స్పందించారు.
— Raghavendra Rao K (@Ragavendraraoba) March 9, 2023
ఇటీవల 'బంగారు తల్లి' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ బడ్జెట్‌పై వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ ను రూ.600 కోట్లు పెట్టి తీశారని, ఇప్పుడు ఆస్కార్ ప్రమోషన్స్ కోసం రూ.80 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఆ రూ.80కోట్లను తనకు ఇస్తే ఎనిమిది సినిమాలు తీసి మీ మొఖాన కొడతానంటూ తమ్మారెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.