మల్టీప్లెక్స్‌లో 600 రూపాయలకు 10 సినిమాలు చూసేయొచ్చు..!

భారతదేశంలోని ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ PVR సినిమాస్ కొత్త ఆఫర్‌లతో ప్రేక్షకులను

By Medi Samrat
Published on : 30 Aug 2023 9:33 PM IST

మల్టీప్లెక్స్‌లో 600 రూపాయలకు 10 సినిమాలు చూసేయొచ్చు..!

భారతదేశంలోని ప్రముఖ చైన్ PVR సినిమాస్ కొత్త ఆఫర్‌లతో ప్రేక్షకులను థియేటర్‌లకి రప్పించడానికి ప్రయత్నం చేస్తోంది. ఇటీవలే ఆహారం, పానీయాల ధరలలో కొన్ని మార్పులు చేసిన PVR ఐనాక్స్ పిక్చర్స్.. వారాంతాల్లో కాకుండా మిగిలిన రోజుల్లో సినిమాలను చూడాలని అనుకునే వాళ్ళ కోసం సరికొత్త పాస్‌ లను తీసుకుని వస్తోంది. ఈ పాస్ లు ఉన్న వాళ్లు ఒక నెలలో 600 రూపాయలకి 10 సినిమాలను చూడవచ్చు.

ఇది కేవలం సోమవారం నుండి గురువారం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇటీవల గదర్ 2, OMG 2, జైలర్ వంటి సినిమాలు భారీ హిట్స్ గా నిలవడంతో మల్టీప్లెక్స్ కు వచ్చే జనం సంఖ్య బాగా పెరిగింది. ఇలాంటి ఆఫర్స్ తో ఫుట్‌ఫాల్స్ సంఖ్య మరింత పెంచాలని భావిస్తూ ఉన్నారు. ఈ కొత్త వారాంతపు ఆఫర్ ఖచ్చితంగా ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్‌లకు రాబడుతుంది. మల్టీప్లెక్స్‌లో అందించే స్నాక్స్, పానీయాలకు సంబంధించి భారీ విమర్శలు రావడంతో పీవీఆర్ వాటి ధరలను కూడా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

Next Story