భారతీయుడు-2 టికెట్ల ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్

‘భారతీయుడు 2’ సినిమాకు సంబంధించి స్పెషల్‌ షోలు వేసుకునేందుకు తెలంగాణ‌ రాష్ట్ర హోంశాఖ గ్నీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది

By Medi Samrat  Published on  10 July 2024 2:23 PM GMT
భారతీయుడు-2 టికెట్ల ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్

‘భారతీయుడు 2’ సినిమాకు సంబంధించి స్పెషల్‌ షోలు వేసుకునేందుకు తెలంగాణ‌ రాష్ట్ర హోంశాఖ గ్నీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డాక్టర్‌ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వాలని చిత్ర నిర్మాణ సంస్థ ప్ర‌భుత్వాన్ని కోరగా.. ఈ అభ్య‌ర్థ‌న‌కు తెలంగాణ‌ రాష్ట్ర హోంశాఖ గ్నీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మల్టీప్లెక్స్ లో 75 రూపాయలతో పాటు సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది.

కమల్- శంకర్ కాంబినేషన్‌లో 1996లో భారతీయుడు చిత్రం ఇచ్చింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ రాబోతుండ‌డంతో మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె సూర్య, సిద్దార్థ్, గుల్షన్ గ్రోవర్‌లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ ఈ సినిమాకు మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందించాడు.

Next Story