తెలంగాణ ఎలక్షన్స్‌.. సైలెంట్‌ మోడ్‌లో టాలీవుడ్‌

సాధారణంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో చాలా మంది స్టార్ హీరోలు, ఇతర సెలబ్రిటీలు ఎన్నికల రేసులో ఉన్న కొంతమంది అభ్యర్థుల పక్షం వహిస్తుంటారు.

By అంజి  Published on  13 Nov 2023 7:34 AM IST
Telangana, Elections, Tollywood,Telugu industry

 తెలంగాణ ఎలక్షన్స్‌.. సైలెంట్‌ మోడ్‌లో టాలీవుడ్‌ 

సాధారణంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో చాలా మంది స్టార్ హీరోలు, ఇతర సెలబ్రిటీలు ఎన్నికల రేసులో ఉన్న కొంతమంది అభ్యర్థుల పక్షం వహించడం, రాజకీయ పార్టీలలో చేరడం , వారికి మద్దతు ఇవ్వడం కూడా మనం ఇప్పటి వరకు చూసి ఉంటాం. అయితే ఈసారి, టాలీవుడ్ సెలబ్రిటీలు వేరే రూట్‌ను తీసుకుంటున్నారు. టాలీవుడ్‌ పరిశ్రమలో ఏమి జరుగుతుందో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

అశ్వినీదత్, కేఎస్ రామారావు లాంటి సీనియర్‌ నాయకులు తెలుగుదేశం పార్టీకి చాలా కాలంగా ఆదరణ ఇస్తున్నారు తప్ప.. కొత్త స్టార్లు ఎవరూ రాజకీయాలకు సంబంధించి అసలు మాట్లాడటం లేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన తారలు కూడా తెలంగాణ ఆధారిత పార్టీలకు లేదా జాతీయ పార్టీలకు మద్దతుగా రావడం లేదు. అదే సమయంలో వారు ఎటువంటి సోషల్ మీడియా పోస్ట్‌లు పెట్టడం, కాన్వాసింగ్‌లో పాల్గొనడం లేదా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఏదైనా చేయడం లేదు. ఈ సార్వత్రిక ఎన్నికల సమయంలో టాలీవుడ్ 'సైలెంట్ మోడ్' బటన్‌ను ఎందుకు యాక్టివేట్ చేసిందో ఆశ్చర్యంగా ఉంది.

రాజకీయాలు ప్రతీకారేచ్ఛగా మారుతున్న రోజులని కొందరు అంటున్నారు. ఒక స్టార్ ఇప్పుడు ఒక నిర్దిష్ట రాజకీయ సంస్థకు మద్దతు ఇస్తే, రేపు ఆ పార్టీ గెలవకపోతే, అధికారంలో ఉన్న వ్యక్తి ఆ స్టార్‌ని, అతని సినిమాలను వేధించవచ్చు. ఇంతకుముందు జరిగిన విషయాలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ఎన్నికల్లో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొనడం లేదని వినికిడి.

Next Story