బాలీవుడ్ మాఫియా నన్ను వేధిస్తోందంటున్న బాలయ్య హీరోయిన్

Tanushree Dutta says she's being harassed. హీరోయిన్ తనుశ్రీ దత్తా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.

By Medi Samrat  Published on  21 July 2022 8:45 PM IST
బాలీవుడ్ మాఫియా నన్ను వేధిస్తోందంటున్న బాలయ్య హీరోయిన్

హీరోయిన్ తనుశ్రీ దత్తా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కొంత మంది వ్యక్తులు తనను టార్గెట్ చేసి వేధిస్తున్నారని.. దీని వెనుక బాలీవుడ్ మాఫియా ఉందని.. ఎవరైనా సరే, ఏదో ఒకటి చేసి తనకు సాయం చేయాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. గతంలో మీటూ వేధింపు సమయంలో తాను ఆరోపణలు చేసినవారే ఇప్పుడు తనను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. తన పనిమనిషిని లోబర్చుకుని తనకు వ్యతిరేకంగా వ్యవహరించేలా చేశారని.. ఆమెతో స్టెరాయిడ్లు, కొన్ని రకాల మందులు తనకు పెట్టించారన్నారు.

ఈ బాధలు భరించలేక రెండు నెలల కింద ఉజ్జయినికి పారిపోయానని తెలిపారు. రెండు సార్లు తన బైకు బ్రేకులు తీసేసి ప్రమాదాలు జరిగేలా చేశారని.. చావు నుంచి బయటపడ్డానని తనుశ్రీ దత్తా పేర్కొన్నారు. సాధారణ జీవితం గడిపేందుకు ముంబైకి తిరిగి వచ్చానని తనుశ్రీ దత్తా తెలిపారు. తాను ఇక పారిపోబోనని, ఆత్మహత్య వంటివేమీ చేసుకోబోనని అన్నారు. కష్టపడి తన కెరీర్‌ని తిరిగి నిర్మించుకుంటానని చెప్పారు. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా హిందీ, తెలుగుతోపాటు పలు ఇతర భాషల సినిమాల్లోనూ నటించారు.







Next Story