మంచు మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న వివాదాల గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మంచు విష్ణు ముందే స్పందించారు. ఆ వివాదాలు చూస్తుంటే తనకెంతో బాధగా ఉందని, 'కన్నప్ప' సినిమా విడుదలయ్యాక కుటుంబ సభ్యులందరూ ఒకచోట కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.
మీ మాటలను నేను గౌరవిస్తానని, గొడవలు జరిగిన కొన్ని రోజులకే మీరు నాకు ఫోన్ చేసి ఏం జరుగుతుందని అడిగారని మంచు విష్ణు తెలిపారు. ఆ విషయాన్ని తాను ఎప్పటికీ మర్చిపోనన్నారు విష్ణు. ప్రస్తుతం భైరవం సినిమా ప్రమోషన్స్ లో ఉన్న మంచు మనోజ్ కూడా విబేధాలను ముగించాలని భావిస్తున్నానని తెలిపారు.