సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు రావాలంటే అందుకు తగ్గ పాత్రలో ఎంతో గ్లామరస్ గా కనిపిస్తూ నటిస్తేనే అవకాశాలు వస్తాయని చాలా మంది భావిస్తుంటారు. హీరోయిన్ల విషయానికి వస్తే వారికి కొంత కాలం మాత్రమే ఇండస్ట్రీలో అవకాశాలు ఉంటాయి. ఆ కొంత సమయంలో మంచి అవకాశాలను దక్కించుకోవడం కోసం గ్లామరస్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఇలాంటి తరహాలోనే "ఝుమ్మందినాదం" సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తాప్సీ ఎంతో గ్లామరస్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. తరువాత ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ టాప్ హీరోయిన్ గా మారిపోయింది.
ఇటీవల కాలంలో ఓ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ తన సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న సమస్యలను గురించి తెలియజేశారు. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకోవాలంటే గ్లామరస్ పాత్రలు చేయాలని ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎక్కువ గ్లామరస్ పాత్రలో నటించాను. కానీ నేను అనుకున్నది సరి కాదని గ్లామరస్ పాత్రలో కన్నా మనసుకు నచ్చిన కథతో సినిమా చేస్తే మంచి విషయం పొందవచ్చని తెలియజేశారు. ప్రస్తుతం అలాంటి కథలను ఎంచుకుని సినిమాలలో నటిస్తున్నట్లు ఆమె తెలిపారు.
బాలీవుడ్ ఇండస్ట్రీ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న తాప్సిని మొదట్లో లేడి ఓరియెంటెడ్ పాత్రలో నటిస్తే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు కొనసాగలేనని భయపెట్టారు.ఆ విధంగా లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించే వారికి హీరోల సరసన నటించే అవకాశాలు రావని చెప్పారు.అయితే వారి మాటలను పట్టించుకోకుండా తనకు నచ్చిన సినిమాలలో నటిస్తూ మంచి విజయాలను అందుకున్నారు. ఒకవైపు ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తూ మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం టాప్ హీరోయిన్ రేంజ్ లోతాప్సి ఉన్నారని చెప్పవచ్చు.