పెళ్లి ప్లాన్స్ బయటపెట్టిన తాప్సి..!
Taapsee Pannu reveals her marriage plans with boyfriend. ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తాప్సి పెళ్లి ప్లాన్స్.
By Medi Samrat Published on 20 Jan 2021 7:09 PM ISTఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తాప్సి తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను సొంతం చేసుకుంది. తరువాత ఈమె దృష్టి బాలీవుడ్ వైపు వెళ్లడంతో ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది.ఒకవైపు కమర్షియల్ సినిమాలలో నటిస్తూ మరోవైపు లేడీ ఓరియంటెడ్ పాత్రలలో నటిస్తున్న తాప్సికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఎట్టకేలకు తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు...
"రష్మీ రాకెట్" సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు తాప్సీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా తన ప్రియుడు మథియాస్ బో గురించి, పెళ్లి ప్రణాళికల గురించి స్పందించారు. నేనెప్పుడూ నా జీవితంలో వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని ఒకే విధంగా చూడను. దేనికి ప్రాధాన్యత దానికి ఉంటుందని తెలిపారు. అందుకోసమే ఇండస్ట్రీకి చెందిన వారితో డేటింగ్ చేయడం లేదని ఈ బ్యూటీ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.
నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వారి పుట్టిన రోజును పురస్కరించుకొని వారి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంటాను. అందులో భాగంగానే మథియాస్ బో పుట్టినరోజు కూడా అదే చేశానని తెలిపారు.ఇక పెళ్ళి విషయానికి వస్తే కెరీర్ పరంగా ఇంకా ఎంతో సాధించాలని ఉంది అనుకున్న స్థాయికి చేరుకున్న తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానని ఈమె తెలియజేశారు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఆలోచిస్తూ సంవత్సరానికి ఐదారు సినిమాలు చేస్తున్నాను. పెళ్లి, వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించినప్పుడు సినిమాల విషయంలో కాస్త నిదానంగా ఉంటానని, ఇప్పుడప్పుడే పెళ్లి గురించి ఆలోచన లేదని ఈ ఇంటర్వ్యూ ద్వారా తాప్సి తెలియజేశారు.