మహేష్ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేయబోతున్న 'సర్కారు వారి పాట' టీం..

Surprise To Mahesh Babu Fans. 'సర్కారు వారి పాట' సినిమా యూనిట్ మహేష్ ఫాన్స్ కి సుర్ప్రైజ్ ఇవ్వబోతుంది.

By Medi Samrat  Published on  16 Feb 2021 2:29 PM IST
Surprise To Mahesh Babu Fans

గతేడాది 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో మంచి మాస్ హిట్ హిట్ కొట్టి ఫ్యాన్స్ ని ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేస్తారని అంతా అనుకున్నారు కానీ సినిమా సెట్స్ పైకి వెళ్లడంలో ఆలస్యం జరగడంతో విడుదల విషయంలో కూడా ఆలస్యం అవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇప్పట్లో ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్లు ఉండవని ఫిక్స్ అయిపోయారు.

కానీ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కోసం ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకుందట మహేష్ అండ్ టీమ్. 'సర్కారు వారి పాట' సినిమాకి సంబంధించిన మేజర్ షెడ్యూల్ ఒకటి దుబాయ్ లో జరుగుతోన్న సంగతి తెలిసిందే.దాదాపు 25రోజుల పాటు ఈ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. అక్కడ షూటింగ్ పూర్తి చేసుకున్నాక దుబాయ్ డైరీస్ పేరుతో ఓ స్పెషల్ వీడియోను వదలబోతుందట యూనిట్.

షూటింగ్ లొకేషన్లతో పాటు ఆన్ లొకేషన్స్ ముచ్చట్లతో ఈ వీడియో రూపొందనుందట. ఈ వీడియో మహేష్ లుక్ ను స్వల్పంగా రివీల్ చేస్తారట. కాస్ట్ అండ్ క్రూను చూపిస్తూ..సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఈ వీడియోను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. మహేష్ అభిమానులకు ఇదొక ట్రీట్ అని.. ఫస్ట్ లుక్ వచ్చే వరకు ఈ వీడియో వాళ్లను ఎంగేజ్ చేస్తుందని భావిస్తున్నారు.




Next Story