మే 31న సూపర్ స్టార్ కృష్ణ 'మోసగాళ్లకు మోసగాడు' రీరిలీజ్

Superstar Krishna's 'Mosagallaku Mosagadu' will be re-released on May 31. దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన నటించిన 'మోసగాళ్లకు మోసగాడు'

By Medi Samrat  Published on  1 May 2023 3:42 PM IST
మే 31న సూపర్ స్టార్ కృష్ణ మోసగాళ్లకు మోసగాడు రీరిలీజ్

Superstar Krishna's 'Mosagallaku Mosagadu' will be re-released on May 31


దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన నటించిన 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రాన్ని మే 31న రీరిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు తెలిపారు. కృష్ణ అభిమానుల కోరిక మేరకే ఈ మూవీని మళ్ళీ థియేటర్ లలోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు. 1971 లో రిలీజ్ అయిన ఈ మూవీ భారతదేశంలో వచ్చిన మొట్ట మొదటి కౌబాయ్ చిత్రం. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ చిత్రం తొలుత 1971, ఆగస్ట్ 27న విడుదలై అప్పట్లో క్లాసిక్ హిట్ గా నిలిచింది. తాజాగా 4కే క్వాలిటీతో రీరిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత ఆదిశేషగిరిరావు ప్రకటించారు.

కృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో మోసగాళ్లకు మోసగాడు ఒకటి. కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయనిర్మల, నాగభూషణం, రావుగోపాలరావు ముఖ్యపాత్రల్లో నటించారు. దాదాపు 52 సంవత్సరాల తరువాత ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేయబోతున్నారు. హీరో కృష్ణ పేరుమీద ఆయన స్వగ్రామమైన బుర్రిపాలెంలో ఓల్డేజ్ హోమ్ నిర్మిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాక ఫిల్మ్ ఇండస్ట్రీని, నంది అవార్డ్స్ ని పట్టించుకోవట్లేదని ఆదిశేషగిరిరావు ఆవేదన వ్యక్తం చేశారు.


Next Story