కృష్ణ చ‌నిపోయాడ‌ని బాధ‌ప‌డ‌కండి.. రామ్‌గోపాల్ వ‌ర్మ షాకింగ్ ట్వీట్‌

Ram Gopal Varma tweet on Super Star Krishna Death.కృష్ణ మృతి పై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ స్పందించాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Nov 2022 11:02 AM IST
కృష్ణ చ‌నిపోయాడ‌ని బాధ‌ప‌డ‌కండి.. రామ్‌గోపాల్ వ‌ర్మ షాకింగ్ ట్వీట్‌

సూప‌ర్ స్టార్ కృష్ణ మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున క‌న్నుమూశారు. ఆయ‌న మ‌ర‌ణంతో ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాలంటూ ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా నివాళులర్పిస్తున్నారు.

కృష్ణ మృతి పై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ స్పందించాడు. సూప‌ర్ స్టార్ మృతి ప‌ట్ల బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని ట్వీట్ చేశాడు. "బాధ ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే కృష్ణ స్వ‌ర్గంలో విజ‌య నిర్మ‌ల‌తో క‌లిసి పాట‌లు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ ఆనందంగా గడుపుతుంటార‌ని అనుకుంటున్నా." అని వ‌ర్మ అన్నాడు. కృష్ణ‌, విజ‌య నిర్మ‌ల క‌లిసి న‌టించిన "మోస‌గాళ‌ల‌కు మోస‌గాళ్లు" చిత్రంలోని ఓ పాట‌ను షేర్ చేశాడు.

బాలకృష్ణ దిగ్భ్రాంతి..

కృష్ణ మృతి పట్ల బాలకృష్ణ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి కృష్ణతో ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. "ఘ‌ట్ట‌మ‌నేని కృష్ణ‌గారి మ‌ర‌ణం తీవ్ర దిగ్భ్రాంతిని క‌లిగించింది. త‌న న‌ట‌న‌తో చిత్ర సీమ‌లో స‌రికొత్త ఒర‌వ‌ళ్లు సృష్టించి ఎన‌లేని ఖ్యాతి సంపాదించి ప్రేక్ష‌కుల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. న‌టుడిగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా, స్టూడియో అధినేత‌గా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఆయ‌న అందించిన సేవ‌లు మ‌రువ‌లేనివి. కృష్ణ‌గారితో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. నాన్న‌గారు, కృష్ణ గారు క‌లిసి అనేక చిత్రాల‌కు ప‌ని చేశారు. ఆయ‌న‌తో క‌లిసి నేను న‌టించ‌డం మ‌రిచిపోలేని అనుభూతి. కృష్ణ గారు లేని లోటు సినీ ప‌రిశ్ర‌మ‌కూ, అభిమానుల‌కు ఎప్ప‌టికీ తీర‌నిది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్నాను. ఇటీవ‌లే సోద‌రుడు ర‌మేష్‌బాబుని, మాతృమూర్తి ఇందిరాదేవీని కోల్పోయి దుఃఖంలో ఉన్న నా సోద‌రుడు మ‌హేష్ బాబుకు ఈ క‌ష్ట‌కాలంలో దేవుడు మ‌నో ధైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటూ.. ఆయ‌న కుటుంబ స‌భ్యులంద‌రికి నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను" అని ఓ ప్రకటన విడుదల చేశారు.




Next Story