హీరో కార్తీ సినిమా సెట్‌లో విషాదం.. స్టంట్‌మ్యాన్ మృతి

కార్తీ, దర్శకుడు PS మిత్రన్‌ల కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న‌ 'సర్దార్ 2' సెట్స్‌లో ఎలుమలై అనే స్టంట్‌మ్యాన్ మరణించాడు.

By Medi Samrat  Published on  17 July 2024 6:51 PM IST
హీరో కార్తీ సినిమా సెట్‌లో విషాదం.. స్టంట్‌మ్యాన్ మృతి

కార్తీ, దర్శకుడు PS మిత్రన్‌ల కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న‌ 'సర్దార్ 2' సెట్స్‌లో ఎలుమలై అనే స్టంట్‌మ్యాన్ మరణించాడు. జూలై 16న ఈ జ‌రిగిన‌ట్లు టీమ్ తెలియ‌జేసింది. ఎలుమలై సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్ తెర‌కెక్కిస్తుండ‌గా 20 అడుగుల ఎత్తు నుండి పడిపోయార‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. . 'సర్దార్ 2' షూటింగ్ జూలై 15న చెన్నైలోని సాలిగ్రామంలోని ఎల్వీ ప్రసాద్ స్టూడియోలో ప్రారంభమైంది. ప్రమాదం గురించి విరుగంబాక్కం పోలీసు అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.

54 ఏళ్ల ఎలుమలై పై నుండి పడిపోవడంతో తీవ్రమైన గాయాలు అయ్యాయి. అంతర్గత రక్తస్రావం కారణంగా ఉదయం 11.30 గంటలకు ఆయన మరణించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ప్రమాదం తర్వాత 'సర్దార్ 2' షూటింగ్ ఆగిపోయింది.

ఈ మేర‌కు ప్రిన్స్ పిక్చర్స్ ప్రకటనలో.. "మా చిత్రం సర్దార్ 2 సెట్స్‌లో స్టంట్ రిగ్ మ్యాన్‌గా పనిచేసిన స్టంట్ యూనియన్ సభ్యుడు మిస్టర్ ఎలుమలై మరణం ప‌ట్ల‌ మేము చింతిస్తున్నాము. మంగళవారం సాయంత్రం జూలై 16న స్టంట్ సీక్వెన్స్‌లు పూర్తి చేస్తున్నప్పుడు ఏలుమలై.. ప్రమాదవశాత్తు 20 అడుగుల ఎత్తులో ఉన్న రోస్ట్రమ్ నుండి పడిపోయి గాయపడ్డారు. అత‌డిని నెరబీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాం. అక్కడ వైద్యుల బృందం అతనికి చికిత్స అందించింది. అయితే జులై 16 రాత్రి 11.30 గంటలకు దురదృష్టవశాత్తు మరణించాడ‌ని నిర్మాత తెలిపారు. ఎలుమలై కుటుంబానికి ప్రొడక్షన్ హౌస్ సానుభూతి తెలిపింది.

జూలై 12న 'సర్దార్ 2' అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. చెన్నైలో జరిగిన పూజా కార్యక్రమానికి దర్శకుడు పిఎస్ మిత్రన్, నటుడు కార్తీ, ఇతర చిత్రబృందం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు శివకుమార్ కూడా హాజరయ్యారు. జూలై 15న చెన్నైలోని ప్రసాద్ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్‌లో 'సర్దార్ 2' షూటింగ్ ప్రారంభమైంది.

Next Story