బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టిన 'స్త్రీ'
శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ- 2 విడుదల తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ గా మారింది
By Medi Samrat Published on 18 Sept 2024 2:49 PM ISTశ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ- 2 విడుదల తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ గా మారింది. స్త్రీ సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా అందరినీ ఆశ్చర్యపరిచేలా కలెక్షన్స్ వర్షం కురిపించింది. ప్రీమియర్స్, మొదటి రోజు నుండి ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఈ సినిమా రెండు వారాంతాల్లో రూ.400 కోట్ల వసూళ్లు రాబట్టింది. స్త్రీ 2 సినిమా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా కలెక్షన్లను బ్రేక్ చేసి బాలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా KGF చాప్టర్ 2, బాహుబలి 2ల హిందీ వెర్షన్ కలెక్షన్స్ ను అధిగమించి 500 కోట్లు వసూలు చేసింది. గణేష్ చతుర్థి సెలవుల సీజన్ కూడా స్త్రీ 2 కు ఎంతో మంది ప్రేక్షకులను తీసుకువచ్చింది. బాక్సాఫీస్ వద్ద 586 కోట్లు వసూలు చేసి సరికొత్త చరిత్రను లిఖించింది. ఇప్పటి వరకు హిందీలో 580 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన రికార్డు జవాన్ సినిమాకు మాత్రమే సొంతం. ఇప్పుడు హిందీలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా స్త్రీ-2 నిలిచింది. ఈ సినిమా త్వరలోనే 600 కోట్ల క్లబ్‌ను కూడా తాకవచ్చు. చిన్న సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ అని ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతోందని ఈ టీమ్ ఇప్పటికే ప్రకటించింది.